లేవాలి! లేచి నిలబడాలి!! నా కోసం ప్రాణాల్ని పోగొట్టుకోబోతున్న ఆ అమాయక జీవిని రక్షించాలి.... ఆ తర్వాత నేను ఏమైనా పరవాలేదు లేవాలి.... లేచి నిలబడాలి.
పళ్ళు కొరుకుతూ దొర్లి క్రింద పడ్డాను మంచం మీదినుంచి.
మళ్ళీ వినవచ్చింది లక్ష్మి అరుపు.
“మధూ... హెల్ప్ మీ... హెల్ప్ మీ... ప్లీజ్!!”
నిప్పుల్లో నిలబడినట్లు తుకతుక లాడుతున్నది నా రక్తం. మెదడంతా మొద్దుబారి పోయింది. కళ్ళముందున్న ప్రపంచం అంతా మాయమైపోయింది. నడుం మీద పలుగులు దింపినట్లు ఎగసుకు వస్తున్న బాధ ఒక్కటే తెలుస్తోంది.
పళ్ళ బిగువున ప్రాకాను గుమ్మం దాకా.
మైకం ముంచుకు వచ్చింది. మూసుకుపోవటం ప్రారంభించాయి కళ్ళు.
“నో....నో” అని అరుస్తూ తలను నేలకేసి కొట్టాను. కరెంట్ షాక్ కొట్టినట్టు జలదరించింది శరీరమంతా.
ఆవేశం ఒక్కసారిగా ముంచుకు వచ్చింది. ఆవేశంతో పాటు కదిలాయి నా కాళ్ళు. ఒక్కసారిగా - నాకు తెలియకుండానే గుమ్మాన్ని పట్టుకొని లేచి నిలబడ్డాను.










Worst novel among all Madhubabu novels