షర్మిల ప్రేమలో పడ్డ మేన్ రోబో ఫీలింగ్స్ వర్ణించిన తీరు అద్భుతం.మేన్ రోబో అగ్నిహోత్ర అనుకుని ప్రేమించిన షర్మిల '" తను పేమించింది మేన్ రోబోను " అని తెలిసినప్పుడు ఒక్కక్షణం గుండె లయ తప్పింది.సులోచన పాత్ర సగటు అమ్మాయిల స్వగతం." దేవుడా అమ్మాయిలను పొడుగ్గా పుట్టించు లేదా విశాలమైన హృదయమున్న మగాళ్లను సృష్టించు " అన్న ఫీలింగ్" హార్ట్ టచింగ్ గా వుంది.
సైన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
చదివిన ప్రతీసారి కొత్తగానే అనిపిస్తుంది.మళ్ళీమళ్ళీ చదవాలని అనిపిస్తుంది.ఆముక్తమాల్యద పాత్ర చాలా బావుంది.ప్రారంభంలో ఉడుత కథ కన్నీళ్లు తెప్పించింది.
can u send me to mail my ,ail id [email protected]
నవ్వును మర్చిపోయి కృత్రిమమైన సంతోషం కోసం పబ్స్ కు వెళ్లి,ప్రమాదకరమైన పబ్జీ గేమ్స్ ఆడి నిరర్థకమైన సంతోషాన్ని వెతుక్కునేవారు ఈ పుస్తకం చదివి మనసారా నవ్వుకోవచ్చు.ఆహ్లాదాన్నే కాదు ఆలోచనను కలిగించే బెస్ట్ కామెడీ స్టోరీస్.ముఖ్యంగా స్వాతిలో బహుమతి పొందిన రెండు కథలు...నవ్వు కనబడుట లేదు,నవ్వు దేవుడొచ్చాడోచ్ ...
" నవ్వు దేవుడి కోసం తపస్సు చేసాడు.తనను దేవుడిని చేయమని అడిగాడు.దేవుడు నవ్వుని "నవ్వు దేవుడిని" చేసాడు.అప్పటి నుంచి ప్రపంచంలో వింత మార్పులు..?నవ్వు దేవుడికి గుడులెక్కడ?నవ్వు దేవుడెక్కడ? "
ఈ ఆలోచనే ఫెంటాస్టిక్ గా వుంది.
I'm in USA. I would like to get this magazine digital or hard copy. Please let me know how can I subscribe?
కథలు లేవని చెప్పేవన్నీ కథలే.కథలు లేకపోతే ఈ కథలు విజయబాపినీడు గారి లాంటి డైరెక్టర్ ఎందుకు ఎంపిక చేస్తారు.హీరోలు ఎప్పుడూ మూసపోసినట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి విభిన్నమైన పాత్రలు పోషిస్తే బావుంటుంది.
మెగాస్టార్ ఇమేజ్ కు మెజీషియన్ పాత్ర సరిగ్గా సరిపోతుంది.,ముఖ్యంగా చిన్నారులు త్వరగా ఆ పాత్రకు కనెక్ట్ అవుతారు,
ఇదే పుస్తకంలో మెగాస్టార్ ను సైంటిస్ట్ పాత్రలో చూడాలని అనుకుంటున్నారా? అని క్యూ నవలలోని పాత్ర గురించి చెప్పడం బావుంది.
ఎందుకంటే చిరంజీవి గారు సైంటిస్ట్ పాత్ర పోషించిన దాఖలాలు లేవు.అందులోనూ గ్రహాంతర వాసుల కథ,
మేన్ రోబో నవలలోని " మేన్ రోబో " పాత్ర కూడా బావుంటుంది,
కుబేరాయనమః నవల చాలా బావుంది.
ఒకే నవలలో ఇన్ని కథలు..విషయాలు రీడబులిటీ చెడకుండా చెప్పిన విధానం సూపర్బ్ .
అపరాధ పరిశోధన నవలల్లో వుండే కిక్కే వేరు.అడుగడుగునా ఆసక్తి ఉత్కంఠ కలగలిసి ఉంటాయి.దానికి కామెడీ తోడైతే మరింత బావుంటుంది.శ్రీసుధామయి డిటెక్టివ్ సిద్దార్థ నవల చదువుతుంటే అలాంటి ఫీలింగ్ కలిగింది.స్కూల్ రోజుల్లో చదివిన పుస్తకాలు.మళ్ళీ అలాంటి డిటెక్టివ్ లు తగ్గిన సమయంలో ఆ లోటును తీర్చినట్టు ఈ నవల.
కామెడీ పరిశోధన ఆసక్తి ఉత్కంఠ మంచి రచనాశైలి వెరసి డిటెక్టివ్ సిద్దార్థ.
మానవ భావోద్వేగాలను పాత్రలుగా మలిచి,చదివించే గుణాన్ని శైలిగా మార్చుకుని తన రచనల్లో వైవిధ్యాన్ని చూపించే విజయార్కె గారి ముద్ర కొట్టొచ్చినట్టు కనిపించే రచన..
అయితే ఇది సన్నివేశాలుగా ఉండడం వల్ల కొంత అసంతృప్తి.ఇదే నవలగా రాసి ఉంటే మరింతగా మాకు సంతృప్తి మిగిలేది.
విజయబాపినీడు గారికి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పంపించిన స్కీరిప్ట్ ను యథాతథంగా అందించడం వల్ల ఇది అనివార్యమని రచయిత పేర్కొండడం గమనార్హం.ఒక సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్ట్టు వుంది.చిరంజీవిగారు ఇలాంటి రెండు పాత్రలను మెజీషియన్ గా ,ఆర్మీ ఆఫీసర్ గా పోషిస్తే అభిమానులకు పండుగే.అబ్రకదబ్ర కథను ( కామెడీ ట్రాక్ ) ను హాసం పత్రిక ద్వారా అందించడం బావుంది.
ఈ కథను నవల రూపంలో చదవలేదనే అసంతృప్తిని ఇదే పుస్తకంలో అదనంగా అందించిన కుబేరాయనమః తీర్చివేసింది.
ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన హాస్యనవల.అల్లరి నరేష్,నిఖిల్ లాంటి వాళ్ళు చేయవలిసిన మంచి సబ్జెక్టు కుబేరాయనమః
Nija jeevitha sathyalu...Thank you sir...
పెద్ద హీరోల సినిమాకు కథలు లేవు అనే దర్శక నిర్మాతలు హీరోలు ఒక్కసారి నవలా ప్రపంచంలోకి తొంగిచూడాలి.కొత్తదనంతో నావెల్టీ అన్న పదానికి అర్థం చెప్పే కథలు అన్వేషిస్తే దొరుకుతాయి,.
ఏసీల్లో నాలుగుగోడల మధ్య ఇతర భాష చిత్రాల సీడీలు చూస్తే ఆత్మల్లేని దేహాలు , మృతదేహాలే దొరుకుతాయి.కానీ...
ఈ నవల చదివితే కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
క్యూ , మేన్ రోబో లాంటి నవలలు " ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ " లా ఉంటాయి.కుబేరాయనమః చదివితే ఇలాంటి సినిమాలు మన కొత్త హీరోలు ఎందుకు ట్రై చేయరు ? అనిపిస్తుంది.
"ఇది అమ్మాయిల కోణంలో...బాధిత మహిళల కోణంలో రాసిన నవల
హారిక జీవితాన్ని విషాదాంతం చేయడం ఇష్టం లేదు. అప్పటి ఆంధ్రభూమి మంత్లీ ఎడిటర్ సికరాజు (శ్రీ కనకాంబరరాజు) గారి సూచన మేరకు అలా రాసాను..ఒక విధంగా కథను విషాదాంతం చేయడం వల్ల సెక్షన్ 494...తీవ్రత పాఠకులకు సరిగ్గా రీచ్ అయ్యింది. హారిక పాత్రతో కనెక్ట్ అయ్యారు...అప్పటి ట్రెండ్‌కు ఆ విషాదాంతం సరైనదే...కానీ ఇప్పుడైతే మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్ లో మార్చాలని అనిపించినా ఆ ఫ్లేవర్..ఆ ఫీల్ ని మార్చడం ఇష్టం లేక యథాతథంగా అందిస్తున్నాను.
ఇప్పుడైతే ఓ థ్రిల్లర్ గా ప్లాన్ చేసేవాడిని.మరో విధంగా....ప్లాన్ చేసేవాడిని"
రచయిత మాటల్లోని నిజాయితీ,ఇందులోని కథలు మనస్సుతో చదివిస్తాయి.మస్తిష్కంతో ఆలోచించేలా చేస్తాయి.
Its really very nice explanation. I am expecting more books from you.
థాంక్యూ కినిగె
అరవై రూపాయల రెంట్ ఆప్షన్ తో ఆరు జానపద నవలలు చదివే అవకాశం ఇచ్చారు.ఒకప్పటి జానపద వైభవాన్ని మళ్ళీ మాకు అందిస్తున్నారు.అన్ని పుస్తకాలు అద్భుతంగా వున్నాయి.ముఖ్యంగా శ్రీసుధామయి గారి శైలి నాటి రాజుల కాలాన్ని కళ్ళముందు నిలిపాయి.
జ్వాలాముఖి నవలలో పులిమీద చిలుక స్వారీ ,మాయాద్వీపంలో మాయక్షుడు, భూమి పొరలను చీల్చుకుని మాయాదర్పణం పైకి రావడం,,అక్షరాల ఇంద్రజాలం.
పిల్లలు వున్న ప్రతీ ఇంట్లో ఈ నవల ఉండాలి.ఈ నవల పిల్లలు చదవాలి.తల్లిదండ్రుల మానసిక సంఘర్షణ అర్థం కావాలి.మనసును కట్టిపడేసే నవల.ఒక తల్లి నిర్ణయం వ్యవస్థనే ప్రశ్నించింది.మానవత్వాన్ని నిలదీసింది.అద్భుతమైన నవల ,
విజయార్కె గారి రచనలు...
మరణశాసనం,మేన్ రోబో ,క్యూ,టార్గెట్,పైసావసూల్...కుబేరాయనమః ..మనిషే దేవుడయ్యాడు...కానీ... నవ్వు దేవోడిచ్చాడోచ్,టక్ టక్ టక్ ,మీ ఇష్టం...ఇలా మీ నవలలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
చిరంజీవి గారు రాసిన జానపద నవల వజ్రాల దీవి ఎంతో బావుంటుంది. అడపా చిరంజీవి గారు రాసే ప్రతి నవల చాలా గొప్పగా వుంటుంది. చెప్పాలంటే సింప్లీ సూపర్బ్. చదువుతున్నంత సేపు ఓ జానపద సినిమా చూస్తున్న పీలింగ్ కలిగింది
ఒక అమ్మగా చెబుతున్నాను.ఎవరు రాయగలరు సర్ ఇలా?
బిడ్డల నిర్లక్ష్యానికి స్వార్థానికి బలైన తల్లుల నాకు గురించి తెలుసు.
ఇది నవల కాదు అమ్మల జీవితం,నాన్నల ఆవేదనలు సారం.వృద్ధుల జీవితాల్లోని విషాదాలకు అక్షరరూపం.
మీ నవలలో ఒక తల్లి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తీర్పు కావాలి ,కొత్తమార్పుకు నాంది కావాలి,
ఇలాంటి అద్భుతమైన నవల రెండు దశాబ్దాలకు పూర్వమే ప్రచురించిన స్వాతి పత్రికకు,
తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని మీ అక్షరాలనుఆదరించిన కన్నడ పాఠకులకు,
మేన్ రోబో పబ్లికేషన్స్ కు
ఇ బుక్ గా అందించిన కినిగెకు
అభినందనలు కృతజ్ఞతలు.
దీనిని నవలగా కాదు తల్లిదండ్రుల ఆవేదనకు అక్షరాల అనువాదంగా చదవాలి.
అద్భుతమైన భావుకత,అత్యద్భుతమైన కథనం .
Enable rent option please
పుస్తకాలు జీవితాలు మారుస్తాయా లేదో కానీ జీవితాన్ని మన కళ్ళముందు ఉంచుతాయి.నిర్ణయం నవల ఆ కోవకు చెందినది.మనసును కట్టి కుదిపేసిన నవల
నా కన్నడ స్నేహితురాలు ఈ నవల ( కన్నడంలో జీవనసంధ్య) కన్నడంలో చదివి బావుందని చెబితే..అదీ ఈ నవల మాతృక తెలుగు
( నిర్ణయం ) అని తెలిసి వెంటనే సెర్చ్ చేస్తే కినిగె లో ఇ బుక్ రూపంలో లభ్యమైంది.
తరువాత నా సహాధ్యాయి తన దగ్గరున్న స్వాతి కలెక్షన్స్ లో నుంచి ఈ నవల నా పుట్టినరోజు కానుకగా కానుకగా ఇచ్చింది.
1997 లో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా వచ్చిన ఈ నవలలో నాకు బాగా నచ్చిన అంశం...
త్యాగం పేరుతో పెద్దయ్యాక కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద దాష్టీకాన్ని ప్రదర్శిస్తే కన్నప్రేమ అని సహించాలా? ఉహూ తిరగబడాలని కన్విన్సింగ్ గా చెప్పడం.
ఇప్పటికీ ఈ నవల .పిల్లలను తల్లిదండ్రులను ఆలోచింపజేస్తుందని నా విశ్వాసం
శ్మశానాన్ని వృద్ధుల ఆశ్రమంగా తీర్చిదిద్దిన తీరు.
కలెక్టర్ కూతురు తన బామ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలుసుకున్న సందర్భం...
కంటికి కన్నీటితెరను తెప్పించింది.
ఈ నవల వచ్చినప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు.,
ఇప్పుడు విశ్రాంత జీవితంలోకి వచ్చాక ఆలోచిస్తే ఇంత మంచి నవలను అప్పుడు మిస్సయ్యాను అనిపిస్తుంది.
ఇది ఒక వ్యక్తిత్వవికాసపుస్తకం ,
అందరూ చదవాలి చదివి ఒక్కసారి వుద్ధాశ్రమాలకు వెళ్లి ఈ పుస్తకం గురించి చెప్పిరావాలి.
పిల్లలకు తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఇవ్వండి.వాళ్లకు జీవితాన్ని పరిచయం చేయండి.
విభిన్నమైన కథాంశం,వాణిజ్యవిలువలతో సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం.ఇది నవల రూపంలో ఉంటే మరింత బావుండేది.
సబ్జెక్టు బావుంది.ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు చిరంజీవి రెండు పాత్రలు వేస్తే బాగా నచ్చుతుంది.మెజీషియన్ పాత్ర పిల్లలను ఆకట్టుకుంటుంది.
అబ్రకదబ్ర కథలోని సుధాకర్ పాత్ర కొత్తగా వుంది .ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు.కుబేరాయనమః నవలిక బావుంది.ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో నవలగా వచ్చింది.
I bought this thinking that this is a book with poems by Sri Natha Kavi, but this is a vachana translation. I feel betrayed by this writer who ever. Dont we know the story, readers expect the poems of Srinatha Kavi and their word by word meanings but its all vachanam. Truely disappointing. And actual cost of this book is 45 rupees only.
అడపా చిరంజీవి గారు రాసే ప్రతి నవల లో ఎత్తుగడ చాలా గొప్పగా వుంటుంది.దాంతో నవలకు మనం ఫెవికోల్ లా అతుక్కుపోయి ఏకబిగిన చదివేటట్టు చేస్తారు. ఆయన రాసే ప్రతి నవలలో తననే ఓ పాఠకుడిగా ఊహించుకుంటూ రాస్తారేమోనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నవలలో బోరుకొట్టే వర్ణనలు గానీ అనవసరమైన డైలాగులు గానీ ఎక్కడా కనిపించవు.చిరంజీవి గారు రాసిన జానపద నవలలు పులిమీద పుట్ర , కపాల దుర్గం, వజ్రాల దీవి, రవ్వల మేడ లాంటి నవలతోపాటు హారర్ నవల గాలి బంగ్లా కూడా ఎంతో బావుంటుంది. ఇప్పుడు ఈ నిశాచరుడు నవల చదువుతున్నప్పుడు ఓ సస్పెన్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. దీన్ని సినిమాగా రూపొందించడానికి అన్ని విధాలా సరిపోతుంది.సినిమా డైరెక్టర్ అయిన నేను ఇలాంటి నవలను సినిమాగా తీయాలని వుంది. నేను ఓ ప్రొడ్యూసర్ కు ఈ నవల చదవమని ఇచ్చాను. ఆయన కు నచ్చి సినిమా చేద్దామంటే త్వరలోనే ఈ నవల సినిమాగా రూపుదిద్దుకుని మీ ముందు వుంటుంది. విష్ మీ ఆల్ ద బెస్ట్!.....గాంధీ మనోహర్.. ఫిల్మ్ డైరెక్టర్.
మంచి ప్రయోగం.ఒకేసారి ఆరుజానపద నవలలు చదివే అవకాశం కలిగింది.ముఖ్యంగా రెంట్ ఆప్షన్ ఇచ్చారు.థాంక్యూ...
ప్రారంభంలోనే ఆకట్టుకునే శైలి.విడవకుండా చదివించే కథనం.
పిల్లలను పెద్దలను చదివించే నవలలు.అభినందనలు
Enable rent option please
Not up to the standard of the writer












