-
-
శ్రీఛానల్
Sree Channel
Author: Sri Ramana
Publisher: Navodaya Publishers
Pages: 191Language: Telugu
"....నూతన సహస్రాబ్దిలోకి యీ ప్రపంచం అడుగు పెట్టబోయే ముందు, అంటే 1997-99 మధ్య కాలంలో ఒక సలక్షణమైన కలం నుంచి వెలువడిన విలక్షణమైన అలఘులఘు వ్యాసపరంపంర యిది! గడచిన శతాబ్దిలో వచ్చిన గొప్ప రచనలను ఏకలవ్యుడి వేళ్ల మీద (ఏకలవ్యుడికి నాలుగు వేళ్లే - పాపం) లెక్కించవచ్చు. ఆ నాలుగింట మూడు మూడున్నర వేళ్లు యీ రచయితకే ముడవాల్సి వస్తుందనడంలో అతిశయోక్తి గాని ఆశ్రిత పక్షపాతం గాని లేవు.
ఈ సంకలనంలో వ్యంగ్యం, హాస్యంతోబాటు నిజాయితీ, మట్టివాసనా షూటుగా గుబాళించాయి. వర్తమాన పరిస్థితులపై ఆవేదన, తిరుగుబాటు ధోరణి ద్యోతకమైంది. శ్రీనాధుని చాటువుల్లో కనిపించిన కొంటెతనం, డీపైన భావుకత మళ్లీ ఇన్నాళ్లకు శ్రీరమణ శ్రీఛానల్‌లో నాకు వినిపించింది.
మానవతా విలువలు తగ్గి, కృత్రిమత్వం పెచ్చరిల్లిపోతున్న యీ రోజుల్లో ఆత్మస్తుతి, స్వార్ధం, స్వోత్కర్ష విశృంఖలంగా విహరిస్తున్న తరుణంలో కొరడా ఝళిపింపుల్లాంటి రచనలు రావల్సిన చారితక్ర అవసరం నేడు ఎంతైనా వుంది.
ఇంకా ఈ రచయిత గురించి ఎన్నో చెప్పాలనీ, చెప్పాల్సినవీ వున్నా - సమయ, స్థలాభావాలవల్ల యిక్కడ ఆగాల్సి వస్తున్నందుకు విచారిస్తున్నాను.
- శ్రీరమణ
(సాక్షాత్తూ రచయితే!)
- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹64.8









